కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లోని ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే సామాజిక సాధికారత. దేశాభివృద్ధిలో ఇది కీలక భూమిక పోషిస్తుంది. ఒకప్పుడు సమాజంలో అంటరానితనం, సామాజిక వివక్ష లాంటి రుగ్మతలు ఉండేవి. వాటిని రూపుమాపేందుకు బలంగా పోరాడిన వ్యక్తుల్లో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఒకరు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన ప్రారంభించిన ‘మహద్ సత్యాగ్రహానికి’ గుర్తుగా ఏటా మార్చి 20న ‘సామాజిక సాధికారత స్మారక దినోత్సవం’గా (Social Empowerment Memorial Day) నిర్వహిస్తారు. దీన్నే ‘సామాజిక సాధికారత దినోత్సవం’ (Social Empowerment Day) అనే పేరుతోనూ పిలుస్తారు. అణగారిన వర్గాల హక్కులను తెలియజేయడంతోపాటు వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
సామాజిక సాధికారత అంటే?
మహద్ సత్యాగ్రహం
భారత్‌లో అణగారిన వర్గాలు
చారిత్రక నేపథ్యం..
అణగారిన వర్గాల హక్కుల కల్పనకు, వారిలో పోరాట స్ఫూర్తిని రేకెత్తించడానికి మహద్ సత్యాగ్రహం ఎంతగానో తోడ్పడింది. దళితులు చౌదర్ చెరువు నీటిని వాడుకోవచ్చని బొంబాయి హైకోర్టు తీర్పు వెలువరించాక 1940, మార్చి 19న అంబేడ్కర్ మహద్‌లో ర్యాలీ నిర్వహించారు. మహద్ సత్యాగ్రహానికి గుర్తుగా ఏటా మార్చి 20న ‘సాధికారత దినోత్సవం’గా జరుపుకోవాలని పిలుపు ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1.డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కింది ఏ సంవత్సరంలో మహద్ సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2025)
1) 1925 2) 1918
3) 1923 4) 1927
సమాధానం: 4
2.సామాజిక సాధికారత స్మారక దినోత్సవం లేదా సామాజిక సాధికారత దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(45వ బీపీఎస్సీ ప్రిలిమ్స్, 2002),(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2023)
1) మార్చి 18 2) మార్చి 18
3) మార్చి 20 4) మార్చి 21
సమాధానం: 3
Q. Which of the following is an appropriate way to counter the marginalization of tribals?
(CTET Paper 2 Social Science, 2021)
1) Portraying tribals as exotic
2) Presenting tribal history
3) Showcasing tribals as vibrant
4) Arranging a dance performance
Ans: 2