ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. దీని వల్ల ఏటా లక్షలాది ప్రజలు ప్రభావితమవుతున్నారు. ఇందులో శరీరంలోని కొన్ని కణాలు అనియంత్రితంగా పెరిగి, ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ట్రిలియన్ల కణాలతో కూడిన మానవ దేహంలో ఎక్కడైనా క్యాన్సర్ రావొచ్చు. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, సమర్థ చికిత్స పొందడం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 4న ‘ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం’గా (World Cancer Day) నిర్వహిస్తారు. ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించేలా చేయడంతో పాటు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడటంపై ప్రపంచ దేశాలను ఏకం చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
క్యాన్సర్ అంటే?
రకాలు
క్యాన్సర్‌లో ప్రధానంగా కింది రకాలు ఉన్నాయి. అవి:
1. కార్సినోమా: చర్మం లేదా శరీరం లోపలి అవయవాలను కప్పి ఉండే కణజాలంలో మొదలవుతుంది. ఇవి అత్యంత సాధారణ రకం క్యాన్సర్లు.
ఉదా: ప్రొస్టేట్, రొమ్ము, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్.
2. సార్కోమా: కొవ్వు, కండరాలు, నరాలు, స్నాయువు, కీళ్లు, రక్తనాళాలు, శోషరస నాళాలు, మృదులాస్థిలో ఇది అభివృద్ధి చెందుతుంది.
3. లుకేమియా: ఇది తెల్ల రక్తకణాల్లో ఏర్పడుతుంది. ఎముక మజ్జలో రక్త కణాలను తయారు చేసే కణజాలంలో వస్తుంది.
4. లింఫోమా, మైలోమా: రోగనిరోధక వ్యవస్థ కణాల్లో ప్రారంభమవుతుంది.
క్యాన్సర్ రావడానికి కారణాలు
చారిత్రక నేపథ్యం
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
Q: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?(ఎంపీ పట్వారీ, 2017)
1) ఫిబ్రవరి 4 2) ఫిబ్రవరి 5
3) ఫిబ్రవరి 6 4) ఫిబ్రవరి 7
సమాధానం: 1
Q: సాధారణంగా కణితులను కింది వేటి ఆధారంగా వర్గీకరిస్తారు?(సీఎస్‌ఐఆర్ యూజీసీ (నెట్), 2022)
1) కారణమైన వైరస్ 2) కనుక్కున్న వ్యక్తి
3) మెటాస్టాటిక్ సామర్థ్యం 4) ఉద్భవించిన కణజాలం లేదా కణం
సమాధానం: 4
Q: Human prostate cancer cells expressing urokinase Plasminogen Activator (uPA) readily metastasize when injected into experimental animals. A scientist genetically modified prostate cancer cells and injected them into experimental animals. The possible observations are listed below:
(CUET PG Zoology, 2024)
A. Overexpressing a mutant version of the uPA protein that does not bind to its receptor led to tumour formation but reduced metastasis.
B. Overexpressing a mutant version of the uPA protein that does not bind to its receptor led to enhanced tumour formation as well as metastasis.
C. Overexpressing a secreted version of the uPA receptor led to tumour formation but reduced metastasis.
D. Overexpressing a secreted version of the uPA receptor reduced tumour formation as well as metastasis.
Which of the following options represents the combination of all correct observations?
1) A and C 2) B and D
3) A and D 4) B and C
Answer: 1