మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష హిందీ. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. ఉత్తర భారతదేశంలో దీన్ని కేవలం సంభాషణగానే కాకుండా తమ సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. భారత సంస్కృతిలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. మన రాజ్యాంగంలోని 351వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. హిందీ భాష ప్రాముఖ్యతను చాటి చెప్పే లక్ష్యంతో ఏటా జనవరి 10న ‘ప్రపంచ హిందీ దినోత్సవం’గా (World Hindi Day) నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష వాడకాన్ని ప్రోత్సహించడంతోపాటు ఈ భాష మాట్లాడే సమూహాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
పేరు ఎలా వచ్చింది?
- పర్షియన్లు 11వ శతాబ్దం ప్రారంభంలో గంగా మైదాన ప్రాంతంపైకి దండెత్తి వచ్చారు. వారు సింధు నది ప్రాంతాన్ని హిందూ/ హిందూష్ అని పిలిచారు. అక్కడి స్థానికులు మాట్లాడే భాషను హిందీగా పేర్కొన్నారు. అలా హిందీకి ఆ పేరు వచ్చింది.
గణాంకాలు
- ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు హిందీని ఉపయోగిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలు వాడుకలో ఉన్నప్పటికీ భూమిపై ఉన్న సగం కంటే ఎక్కువ జనాభా 23 ప్రధాన భాషల్లోనే సంభాషిస్తున్నారు. వాటిలో హిందీ ఒకటి.
- ప్రపంచంలోని సజీవ భాషలపై అత్యంత సమగ్రమైన డేటాబేస్ అందించే ఎథ్నోలాగ్ (Ethnologue) ప్రకారం, 2025లో భూమిపై అత్యధిక జనాభా మాట్లాడే భాషల్లో హిందీ మూడో స్థానంలో ఉంది. 60.91 కోట్ల ప్రజలు దీన్ని మాట్లాడతారని తెలిపింది. ఇంగ్లిష్ (150 కోట్లు), మాండరిన్ చైనీస్ (120 కోట్లు) వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
హిందీ భాషా దినోత్సవం
- మన దేశంలో హిందీ భాషా దినోత్సవాన్ని ఏటా సెప్టెంబరు 14న నిర్వహిస్తారు. 1949లో ఇదే తేదీన రాజ్యాంగంలోని ఆర్టికల్ 351లోని 8వ షెడ్యూల్‌లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. దీంతో పాటు ఆంగ్లానికీ ఆ హోదా కల్పించారు. మొదట్లో రాజ్యాంగంలో 14 షెడ్యూల్ భాషలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 22కి చేరింది.
- హిందీని యూనియన్ స్థాయిలో అధికారికంగా గుర్తించినందుకు గుర్తుగా ఏటా సెప్టెంబరు 14న ‘హిందీ భాషా దినోత్సవం’గా నిర్వహిస్తారు.
చారిత్రక నేపథ్యం
- హిందీ భాషను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించే లక్ష్యంతో 1975, జనవరి 10న నాగ్‌పుర్‌లో మొదటి హిందీ ప్రపంచ సదస్సు జరిగింది. దీన్ని నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు. 30 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
- ఈ సదస్సు జరిగిన జ్ఞాపకార్థం ఏటా జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం (విశ్వ హిందీ దివస్)గా జరపాలని 2006లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. భాషపై అవగాహన, సాంస్కృతిక మార్పిడి, హిందీని ప్రపంచ భాషగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
(ఓపీఎస్సీ ఏఎస్‌ఓ, 2018)
Q: ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) జనవరి 10 2) జనవరి 11
3) జనవరి 12 4) జనవరి 13
సమాధానం: 1
(ఎంపీ పోలీస్ కానిస్టేబుల్, 2018)
Q: మొదటి హిందీ కవితను రచించిన వారు?
1) మున్షీ ప్రేమ్‌చంద్ 2) దినకర్
3) అమీర్ ఖుస్రో 4) జై శంకర్ ప్రసాద్
సమాధానం: 3
(SSC CPO, 2019)
Q: As per the 2011 census, Hindi has retained its position as a predominant language spoken by about ______ of the population.
1) 39.36% 2) 46.25% 3) 37% 4) 43.63%
Answer: 4
(DSSSB TGT Hindi Male General Section, 2018)
Q: How many languages were initially included in the Eighth Schedule of the Indian Constitution?
1) 14 2) 18 3) 16 4) 22
Answer: 1
(MP Police Constable, 2025)
Q: World Hindi Day is celebrated on January 10 every year. In which year was it celebrated for the first time?
1) 2000 2) 2002 3) 2004 4) 2006
Answer: 4