భూ భ్రమణ దినోత్సవం

భూ భ్రమణ దినోత్సవం

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనందరికీ తెలిసిందే. సూర్యోదయం, సూర్యాస్తమయం; రాత్రి, పగళ్లు; రుతువుల్లో మార్పులు లాంటివి సంభవించడానికి భూ భ్రమణమే కారణం. భూమి ఆవిర్భావం నుంచి వీటిలో ఎలాంటి మార్పు లేదు. అయితే భూమి తన అక్షంపై తిరుగుతుందని మొదటగా నిరూపించిన శాస్త్రవేత్త లియోన్‌ ఫోకాల్ట్‌. ఒక పెండ్యులం సాయంతో ఆయన ఈ విషయాన్ని రుజువు చేశారు. భూ భ్రమణాన్ని నిరూపించినందుకు గుర్తుగా ఏటా జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ‘భూ భ్రమణ దినోత్సవం’గా (Earth’s Rotation Day) నిర్వహిస్తున్నారు. భూమి చలనం, దాని ఆవశ్యకతలను ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

భూ భ్రమణం అంటే?

  • భూమి తన అక్షాన్ని ఆధారం చేసుకుని తనచుట్టూ తాను చేసే చలనాన్ని భూభ్రమణం అంటారు. దీన్నే ఆత్మభ్రమణం అని కూడా పిలుస్తారు. భూ భ్రమణం గంటకు సగటున 1610 కి.మీ.ల వేగంతో ఉంటుంది. భూమి ఒక భ్రమణం చేయడానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్ల కాలం పడుతుంది. 
  • భూమి తన చుట్టూ తాను పడమర నుంచి తూర్పునకు తిరుగుతుంది. కాబట్టి రోజూ సూర్యుడు తూర్పున ఉదయించి, పడమరన అస్తమించడం మనం గమనిస్తాం.
  • భూమి వేగంగా తిరుగుతున్నప్పటికీ భూమిపై నివసించే జీవరాశి కింద పడకపోవడానికి కారణం భూమి గురుత్వాకర్షణ శక్తి. భూభ్రమణ సమయంలో భూమి కదలికలను మనం గుర్తించలేకపోవడానికి కారణం దానితోపాటు అంతే వేగంతో మనం, మన చుట్టూ ఉన్నవి కూడా అంతే వేగంతో కదులుతూ ఉండటమే. 

భూ భ్రమణ సమయంలో భూమిపై సంభవించే మార్పులు 

  • రాత్రి - పగలు ఏర్పడటం.
  • పోటుపాటులు సంభవించడం.
  • పవనాలు, సముద్ర ప్రవాహాల దిశల్లోనూ మార్పులు కలగడం.
  • సూర్యుడు రోజులో కొన్ని సమయాల్లో భూమి అక్షానికి వివిధ ఎత్తుల్లో ఉండటం.
  • సూర్యుడు, చంద్రుడు, ఇతర నక్షత్రాలు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నట్లుగా కనిపించడం.

చారిత్రక నేపథ్యం

  • భూ భ్రమణ స్వభావం గురించి పూర్వ కాలం నుంచే అనేకమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. క్రీ.పూ.470లో గ్రీకులు భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని పేర్కొన్నారు. భూమి చలనం వాస్తవానికి ఎలా జరుగుతుందనే విషయంపై అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించారు. అయితే అవన్నీ నిర్ధారణ కాలేదు.
  • 1851లో ఫ్రెంచ్‌ భౌతిక శాస్త్రవేత్త లియోన్‌ ఫోకాల్ట్‌ ఒక లోలకం (పెండ్యులం) సాయంతో మొదటిసారి భూమి భ్రమణాన్ని ప్రపంచానికి చూపించారు. ఆయన పారిస్‌లోని పాంథియోన్‌ గోపురం నుంచి నేల నుంచి 75 అడుగుల ఎత్తులో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వైర్‌ ద్వారా ఒక లోలకాన్ని వేలాడదీశారు. అది 200 పౌండ్ల బంగారు పూతతో ఉన్న గోళం. భూ భ్రమణానికి తగ్గట్లు దాని లోలకం తలం కాలక్రమేణా మారుతున్నట్లు ఆ ప్రయోగం రుజువు చేసింది. భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుందని నిరూపించేందుకు ఆయన నిర్వహించిన ప్రయోగానికి గుర్తుగా ఏటా జనవరి 8న ‘భూ భ్రమణ దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (యూజీ) సీబీటీ, 2025)

Q: భూమి తన అక్షంపై ఒక భ్రమణాన్ని సుమారుగా ఎంత సమయంలో పూర్తి చేస్తుంది?

1) 365 రోజులు            2) 24 గంటలు

3) 300 రోజులు            4) 12 గంటలు

సమాధానం: 2

(హెచ్‌పీ జేబీటీ టీఈటీ, 2013)

Q: భూమి తన అక్షంపై ఎటు నుంచి ఏ దిక్కుకు తిరుగుతుంది?

1) తూర్పు నుంచి పడమరకు     2) పడమర నుంచి తూర్పునకు

3) ఉత్తరం నుంచి దక్షిణానికి      4) దక్షిణం నుంచి ఉత్తరానికి

సమాధానం: 2

(SSC MTS, 2017)

Q: What causes day and night cycle on Earth?
1) Rotation                       2) Revolution
3) Rotation and Revolution both        4) None of these
Answer: 1

(RRB MI Translator, 2015)

Q: Day and Nights are caused by
1. rotation of the earth on its axis
2. revolution of the earth around the sun
3. inclination of earth's axis 
1) Only 1 is correct               2) 1 and 2 are correct
3) 2 and 3 are correct             4) All are correct
Answer: 1

(UPSC Civil Services (Prelims) Official Paper 2013)

Q: Variations in the length of daytime and nighttime from season to season are due to
1) the earth's rotation on its axis
2) the earth's revolution round the sun in an elliptical manner
3) latitudinal position of the place
4) revolution of the earth on tilted axis
Answer: 4

 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram