ప్రపంచ కుటుంబ దినోత్సవం

ప్రపంచ కుటుంబ దినోత్సవం
ఒక ఇంట్లో నివసించే కొందరు వ్యక్తుల సమూహాన్నే కుటుంబంగా పేర్కొంటారు. వీరి మధ్య వైవాహిక, రక్తసంబంధాలు ఉంటాయి. ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది. మనిషి సామాజిక జీవనానికి ఇదే మూలం. వ్యక్తికి సమాజంలో తొలి గుర్తింపు కుటుంబం ద్వారానే లభిస్తుంది. అంతేకాక బాధ్యత ఉన్న వ్యక్తిగా మెలగడానికి అవసరమైన శిక్షణ ఇదే అందిస్తుంది. కుటుంబ వ్యవస్థ గొప్పతనం, ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జనవరి 1న ‘ప్రపంచ కుటుంబ దినోత్సవం’గా (Global Family Day) నిర్వహిస్తారు. ప్రజల మధ్య ఐక్యత, శాంతిని పెంపొందించడంతోపాటు మనమంతా ప్రపంచ కుటుంబంలో భాగం అనే భావనను విస్తృతం చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
కుటుంబం అంటే?
  • సాధారణంగా దంపతులు, వారి పిల్లలు కలిసి జీవించడాన్ని కుటుంబంగా పేర్కొంటారు. దీన్ని ఆంగ్లంలో ‘ఫ్యామిలీ’ అని పిలుస్తారు. ఇది 'Famulus' అనే రోమన్‌ పదం నుంచి ఏర్పడింది. దీని అర్థం ‘సేవకుడు’. 
  • అయితే Familiya అనే లాటిన్‌ పదం నుంచి Family ఏర్పడిందని కొందరు సామాజికవేత్తల అభిప్రాయం. Familiya అంటే కుటుంబం అని, అందులో సేవకులు లేదా బానిసలు, కుటుంబసభ్యులు కలిసి ఉండేవారని అర్థం. 
కుటుంబం - రకాలు
కుటుంబ స్వరూప స్వభావాల ఆధారంగా వివిధ రకాలుగా విభజించారు.
వంశానుక్రమం ఆధారంగా మూడు రకాలు:
1) మాతృ వంశీయ కుటుంబం
2) పితృ వంశీయ కుటుంబం
3) పితృ-మాతృ వంశీయ కుటుంబం.
కుటుంబ పరిణామం ఆధారంగా రెండు రకాలు: 
1) ప్రాథమిక కుటుంబం లేదా వ్యష్టి కుటుంబం (Nuclear Family)
2) సమష్టి కుటుంబం (Joint Family).
కుటుంబంపై యాజమాన్యం ఆధారంగా రెండు రకాలు: 
1) పితృస్వామిక కుటుంబం 
2) మాతృస్వామిక కుటుంబం.
దంపతుల నివాసం ఆధారంగా 5 రకాలు: 
1) పితృ స్థానిక కుటుంబం 
2) మాతృ స్థానిక కుటుంబం
3) ద్వి స్థానిక కుటుంబం 
4) మాతుల స్థానిక కుటుంబం
5) నూతన స్థానిక కుటుంబం.
వారసత్వ సంక్రమణం ఆధారంగా రెండు రకాలు: 
1) మాతృ వారసత్వ సంక్రమణ కుటుంబం 
2) పితృ వారసత్వ సంక్రమణ కుటుంబం.
వివాహ రూపం ఆధారంగా రెండు రకాలు: 
1) ఏక వివాహ కుటుంబం 
2) బహువివాహ కుటుంబం. 
బహువివాహ కుటుంబాన్ని మళ్లీ రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: బహుభార్యత్వ కుటుంబం, బహుభర్తృత్వ కుటుంబం. 
చారిత్రక నేపథ్యం
  • ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 1998, నవంబరులో 21వ శతాబ్దపు మొదటి దశాబ్దాన్ని ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో శాంతి, అహింసను ప్రోత్సహించాలని భావించింది. దీనికి అనుగుణంగా 2001-10 కాలాన్ని The International Decade for a Culture of Peace and Non-Violence for the Children of the World గా ప్రకటించింది. 
  • కుటుంబ వ్యవస్థ ద్వారానే దీన్ని సాధించడం కుదురుతుందని యూఎన్‌ఓ భావించింది. 2000, జనవరి 1న ఐక్యరాజ్య సమితి ‘వన్‌ డే ఇన్‌ పీస్‌’ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా శాంతియుత వాతావారణం ఉండాలంటే ప్రజలంతా ఒకే కుటుంబం అనే భావనతో మెలగాలని అందులో సూచించారు. దీనికి మరింత ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో యూఎన్‌ఓ ఏటా జనవరి 1న ‘ప్రపంచ కుటుంబ దినోత్సవం’గా జరపాలని తీర్మానించింది. 
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
(ఏసీసీ 123 సీజీఏటీ, 2020)
Q: ప్రపంచ కుటుంబ దినోత్సవాన్ని ఏటా కింది ఏ తేదీన జరుపుతారు?
1) జనవరి 18       2) ఫిబ్రవరి 1
3) జనవరి 1         4) ఆగస్టు 7
సమాధానం: 3
(రాజస్థాన్‌ థర్డ్‌ గ్రేడ్‌ లెవల్‌ 2, 2012)
Q: ఉమ్మడి కుటుంబంలోని సభ్యులపై ఎవరికి నియంత్రణ ఉంటుంది?
1) తల్లికి                  2) తండ్రికి
3) ముఖ్యుడికి        4) సోదరుడికి
సమాధానం: 3
(RRB Staff Nurse, 2019)
Q: A family where the male is the head of the family and possesses all powers is called?
1) Nuclear family            2) Matriarchal family
3) Joint family                 4) Patriarchal family
Answer: 4
(CTET Sept 2016)
Q: "A family is a unit consisting of mother, father and their two children." This statement is:
1) incorrect, because there are many kinds of families and one cannot classify a family as being of only one kind
2) correct, since this is an ideal family size
3) correct, because this is what all Indian families are like
4) incorrect, because the statement should specify that the children are biological
Answer: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram