అంటువ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా డిసెంబరు 27న ‘అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవం’గా (International Day Of Epidemic Preparedness) నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల నివారణ, సంసిద్ధత, సహకారాలను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
అంటువ్యాధి అంటే?
అంటువ్యాధులు వ్యాపించే విధానం
అంటువ్యాధులు కింది పద్ధతుల ద్వారా వ్యాప్తి చెందుతాయి.
1. తుంపరల ద్వారా వ్యాపించేవి: రోగి ద్వారా గాలిలోకి విడుదలయ్యే తుంపరలను పీల్చినప్పుడు ఆరోగ్యవంతులకు ఆ వ్యాధులు సోకుతాయి.
ఉదా: కొవిడ్-19, క్షయ, ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ), స్వైన్‌ఫ్లూ, జలుబు, హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మెటిన్యూమో వైరస్) మొదలైనవి.
2. కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపించేవి: నిల్వ ఉన్న, సూక్ష్మజీవులు లేదా పరాన్నజీవులతో కలుషితమైన ఆహార పదార్థాలను తినడం వల్ల, కలుషిత నీటిని తాగడం వల్ల అంటువ్యాధులు సోకుతాయి.
ఉదా: కలరా, టైఫాయిడ్, డయేరియా, డీసెంటరీ, అమీబియాసిస్ మొదలైనవి.
3. ప్రత్యక్ష తాకిడి: రోగిని ముట్టుకోవడం, వారి వస్తువులను వాడటం, కలుషిత రక్తం, లైంగిక సంపర్కం లాంటివి.
ఉదాహరణ: చికెన్‌పాక్స్ (అమ్మవారు), స్మాల్‌పాక్స్ (మశూచి), హెపటైటిస్-బి, ఆంత్రాక్స్, ఎబోలా, ఎయిడ్స్, గనేరియా, సిఫిలిస్, హెర్పిస్, హ్యూమన్ పాపిలోమా వైరస్ లాంటివి.
4. కలుషిత నేల వల్ల వ్యాపించే వ్యాధులు: కాలుష్యంతో కూడిన నేలలో ఉన్న వస్తువుల వల్ల గాయమైతే వాటి ద్వారా టెటనస్, సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి వ్యాధికి కారణమవుతాయి.
5. జంతువుల నుంచి వ్యాపించే వ్యాధులు: పెంపుడు లేదా అడవి జంతువులు కరిచినప్పుడు/ గీరినప్పుడు ఆ గాయాల ద్వారా సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించడంతో వ్యాధులు వస్తాయి.
ఉదా: రేబిస్, ఆంత్రాక్స్, బర్డ్‌ఫ్లూ లాంటివి.
6. కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధులు: రక్తాన్ని పీల్చే దోమలు, పేను, ఇతర కీటకాలు వ్యాధి సోకిన వ్యక్తులను లేదా ఆతిథేయిగా వ్యవహరించే జంతువులను కుట్టి, తిరిగి మానవులను కుట్టినప్పుడు సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి వ్యాధులను కలిగిస్తాయి.
ఉదా: ఆడ అనాఫిలస్ దోమ - మలేరియా; ఆడ క్యూలెక్స్ దోమ - లింఫాటిక్ ఫైలేరియాసిస్ (బోదకాలు), జపనీస్ ఎన్‌సెఫలైటిస్ (మెదడువాపు) మొదలైనవి.
చారిత్రక నేపథ్యం
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
ప్రశ్న: అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవాన్ని ఏటా కింది ఏ తేదీన నిర్వహిస్తారు? (ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ 2022)
1) డిసెంబరు 25 2) డిసెంబరు 26
3) డిసెంబరు 27 4) డిసెంబరు 28
సమాధానం: 3
ప్రశ్న: కిందివాటిలో ఏది అంటువ్యాధి?(ఈఎస్‌ఐసీ ఏఎన్‌ఎం, 2016)
1) కలరా 2) గాయిటర్
3) ఆస్తమా 4) సీఓపీడీ
సమాధానం: 1
Q: Epidemic of disease refers to: (MP Mahila Supervisor Official Paper, 2017)
1) Spread of disease in pregnant women
2) Spread of disease among adolescent group
3) Outbreak of disease that attack many people at same time
4) Affects mostly children
Ans: 3
Q: An infection constantly maintained at a baseline level in a geographic area without external input is known as (CDS GK 2021)
1) Endemic 2) Pandemic
3) Epidemic 4) Outbreak
Ans: 1