ప్రపంచ మృత్తికా దినోత్సవం

ప్రపంచ మృత్తికా దినోత్సవం

సహజ వనరుల్లో మృత్తికలు ప్రధానమైనవి. ఇవి భూమి ఉపరితలంపై చిన్న రేణువులు, అనేక కర్బన - అకర్బన పదార్థాలతో కూడిన పలుచటి పొరగా ఉంటాయి. వీటినే నేలలు అని కూడా అంటారు. ఇవి జీవ, పునర్వినియోగ వనరులు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండే దేశాల్లో వీటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. భూమిపై ఆరోగ్యకరమైన నేల ప్రాముఖ్యాన్ని తెలియజేసే లక్ష్యంతో ఏటా డిసెంబరు 5న ‘ప్రపంచ మృత్తికా దినోత్సవం’గా (World Soil Day) నిర్వహిస్తారు. పర్యావరణ వ్యవస్థలో నేలలు పోషించే పాత్రను తెలియజేయడంతోపాటు ఈ అమూల్యమైన వనరును రక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

నేల ప్రాముఖ్యత

  • భూమిపై జీవించడానికి నేల చాలా ముఖ్యమైంది. దీని మందం సుమారు 25 నుంచి 35 సెం.మీ. ఉంటుంది. మొక్కలు, వృక్షాలకు కావాల్సిన నీరు, పోషకాలు దీని ద్వారానే అందుతాయి. మానవ ఆహార అవసరాలను తీర్చడంలోనూ ఇదే కీలకంగా వ్యవహరిస్తుంది. పంటలు, ఇతర ఉపయోగకర మొక్కలు పెంచాలంటే ఆరోగ్యకరమైన నేల అవసరం. పశువులకు అవసరమైన గడ్డి కూడా దీని ద్వారానే లభిస్తుంది. 
  • నేలలో అనేక రకాల ఖనిజాలు ఉంటాయి. వ్యర్థాలను రీసైకిల్‌ చేస్తాయి. వృక్ష, మానవ, జంతు అవశేషాలను తనలో కలుపుకుంటాయి. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడంలోనూ సాయం చేస్తాయి. 
  • భూమిపై ఉండే ప్రజల కంటే ఒక టేబుల్‌ స్పూన్‌ మట్టిలో ఎక్కువ జీవులు ఉంటాయి. 
  • ఇంత ప్రాముఖ్యం ఉన్న మృత్తికల్లో వివిధ వ్యర్థాలు కలవడంతో సహజ లక్షణాలు కోల్పోయి నేల సారం దెబ్బతింటోంది. ఆ ప్రభావం పండించే పంటపై పడుతోంది.

రకాలు

ప్రపంచంలోని మృత్తికలు/ నేలలను అవి ఏర్పడే ప్రాంతాలు, అక్కడి శీతోష్ణ పరిస్థితుల ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:

1. జోనల్‌ మృత్తికలు

2. ఇంట్రాజోనల్‌ మృత్తికలు  

3. అజోనల్‌ మృత్తికలు.

చారిత్రక నేపథ్యం

  • వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా నేల క్షీణతకు గురవుతోందని 2002లో ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ సాయిల్‌ సైన్సెస్‌ (ఐయూఎస్‌ఎస్‌) గుర్తించింది. మృత్తికల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా ఒక రోజును ఏర్పాటు చేయాలని ఇది భావించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ), థాయ్‌లాండ్‌ సంయుక్తంగా ఏటా డిసెంబరు 5న ‘ప్రపంచ మృత్తికా దినోత్సవం’గా జరపాలని 2013లో తీర్మానించాయి.  

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

Q: ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని మొదటిసారి ఎప్పుడు నిర్వహించారు?

(తెలంగాణ హైకోర్టు ఫీల్డ్‌ అసిస్టెంట్, 2019)

1) 2017, డిసెంబరు 5            2) 2016, డిసెంబరు 5

3) 2014, డిసెంబరు 5            4) 2015, డిసెంబరు 5

సమాధానం: 3

(KVS Junior Secretariat Assistant Official 2023)

Q: Which of the following statement/s is/are not correct?
A) Black soil covers most of the Deccan Plateau.
B) Black soils are rich in lime and iron, but it lacks in magnesia.
Select the correct answer using the code given below:
1) A only              2) B only
3) Both A and B        4) Neither A nor B
Answer: 3

(CDS GK, 2018)

Q: Which one of the following is the theme of the World Soil Day, 2017?
1) Soils and pulses, a symbol for life
2) Caring for the Planet starts from the Ground
3) Soils, a solid ground for life
4) Soils, foundation for family farming
Answer: 2

 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram