నావికాదళ దినోత్సవం

నావికాదళ దినోత్సవం

భారత సాయుధ దళాల్లో నావికా విభాగం ఒకటి. దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో, మన తీర ప్రాంతాలను కాపాడటంలో, శత్రుమూకల కారణంగా సముద్రంలో తలెత్తే సంక్షోభాలను ఎదుర్కోవడంలో భారత నావికా దళం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది సాధించిన విజయాలు, దేశ రక్షణలో అంకితభావంతో అందించే సేవలను గౌరవించే లక్ష్యంతో ఏటా డిసెంబరు 4న ‘నావికాదళ దినోత్సవం’గా (Navy Day) నిర్వహిస్తారు. జాతీయ భద్రతను కాపాడటం, అంతర్జాతీయ సంబంధాలు - సహకారాన్ని పెంపొందించడం, స్థిరమైన సముద్ర వాతావరణాన్ని ప్రోత్సహించడంలో నావికాదళ పాత్రను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ముఖ్య విషయాలు

  • భారత నావికాదళ ప్రాథమిక లక్ష్యం దేశ సముద్ర సరిహద్దులను కాపాడటం. యుద్ధం, శాంతి సమయాల్లో భారతదేశ భూభాగం, సముద్ర ప్రయోజనాలకు ఏదైనా ముప్పు కలిగినప్పుడు లేదా దురాక్రమణ ఎదురైనప్పుడు ఇది వాటిని నిరోధిస్తుంది. ఇతర సాయుధ దళాలైన వైమానిక, సైన్యంతో కలిసి పనిచేస్తుంది. 
  • భారత రాష్ట్రపతి దీనికి సుప్రీం కమాండర్‌గా వ్యవహరిస్తారు. ఫోర్‌-స్టార్‌ అడ్మిరల్‌ నావికా దళానికి ప్రధాన అధికారి (చీఫ్‌ ఆఫ్‌ నావల్‌స్టాఫ్‌)గా ఉంటారు. ప్రస్తుతం అడ్మిరల్‌ దినేశ్‌ కె త్రిపాఠి ఈ పదవిలో ఉన్నారు (2024, ఏప్రిల్‌ 30 నుంచి 2025 డిసెంబరు 4 నాటికి). 
  • ఇతర దేశాల నావికా దళాలతో ఉమ్మడి విన్యాసాలు, మానవతా కార్యక్రమాలు, విపత్తు నిర్వహణ సహాయ చర్యల్లో పాల్గొనడం ద్వారా ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహిస్తుంది.
  • భారత నావికా దళ నినాదం: ‘షామ్‌ నో వరుణః’
  • ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను భారత నావికాదళ పితామహుడిగా పేర్కొంటారు. 

చారిత్రక నేపథ్యం

  • 1971 డిసెంబరు 3న భారత్‌ - పాకిస్థాన్‌ యుద్ధం ప్రారంభమైంది. పాకిస్థాన్‌ చెర నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడమే లక్ష్యంగా ఇది జరిగింది. భారత వైమానిక స్థావరాలపై పాకిస్థాన్‌ ఊహించని దాడి చేసింది. దీనికి ప్రతిగా మన నావికాదళం డిసెంబరు 4న ఆపరేషన్‌ ట్రైడెంట్‌ (Trident) ను ప్రారంభించింది. కరాచీలోని నావికా ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపింది.
  • ఆపరేషన్‌ ట్రైడెంట్‌ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న మన దేశంలో నావికాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1972 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుతున్నారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(ఎంపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ 2025)

Q: భారత నావికాదళ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

1) డిసెంబరు 4            2) సెప్టెంబరు 16

3) జనవరి 15            4) జనవరి 12

సమాధానం: 1

(DSSSB Patwari 2019)
Q:
Where is the headquarters of the Southern Naval Command of the Indian Navy located?
1) Chennai                2) Mangalore
3) Trivandrum            4) Kochi
Answer: 4

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram