అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

ఆహారం, ఇల్లు, దుస్తులు, ఆరోగ్యం, విద్య లాంటి కనీస జీవన అవసరాలను సమకూర్చుకోలేని స్థితినే పేదరికం అంటారు. ఈ స్థితిలో ఉండి, కనీస స్థాయి జీవనాధార ఆదాయం లేనివారిని పేదలుగా పేర్కొంటారు. ఇదొక సాంఘిక, ఆర్థిక లక్షణం. ఉపాధి లేమి, అధిక జనాభా పేదరికానికి ప్రధాన కారణాలు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని సమస్యలకు మూలకారణమై, అనేక ప్రభావాలకు దారితీస్తుంది. దారిద్య్రం వల్ల కలిగే సమస్యలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా అక్టోబరు 17న ‘అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం’గా నిర్వహిస్తారు. దీనివల్ల ప్రభావితమైన వారికి సహాయసహకారాలు అందించడంతోపాటు పేదరికాన్ని రూపుమాపడానికి చేపట్టిన చర్యలపై విస్తృత ప్రచారం కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్ర పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో 1987, అక్టోబరు 17న పారిస్‌లోని ట్రోకాడోలో లక్ష మందికి పైగా ప్రజలతో ఒక సమావేశం జరిగింది. ఏటీడీ (ఆన్‌ టుగెదర్‌ ఇన్‌ డిగ్నిటీ) ఫోర్త్‌ వరల్డ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు జోసెఫ్‌ రెసిన్స్కీఆధ్వర్యంలో ఇది జరిగింది. పేదరికం మానవ హక్కుల ఉల్లంఘనగా ఇందులో పేర్కొన్నారు.

ఈ సమావేశం జరిగిన గుర్తుగా ఏటా అక్టోబరు 17న ‘అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం’గా నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 1992, డిసెంబరు 22న తీర్మానించింది.

2025 నినాదం: Ending social and institutional maltreatment by ensuring respect and effective support for families

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram