2025లోనూ ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 157 ప్రకృతి వైపరీత్యాలు కోట్ల మంది ప్రజలను ఇబ్బంది పెట్టినట్లు వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సంస్థ నివేదిక పేర్కొంది. 2024లో నెలకొన్న ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డును అధిగమించకపోయినా.. 2025 అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా నిలిచినట్లు వెల్లడించింది. చరిత్రలో తొలిసారిగా మూడేళ్ల సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు దాటింది. వేసవిలో వేడి, శీతకాలంలో చలి తీవ్రత అధికమైనట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా 1995-2024 మధ్యలో 9,700 ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లు ఇటీవల జర్మన్‌వాచ్‌సంస్థ విడుదల చేసిన ‘క్లైమేట్‌రిస్క్ ఇండెక్స్-2026’ పేర్కొంది. వాటి వల్ల ప్రత్యక్షంగా 8,32,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.