2025లో వడగాడ్పులు, కార్చిచ్చులు, వరదలు, కరవు, తుపానులు మొదలైన వాతావరణ విపత్తుల వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.10 లక్షల కోట్లకుపైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని రష్యాకు చెందిన క్రిస్టియన్ ఎయిడ్ నివేదిక వెల్లడించింది. ఈ విపత్తులు సహజమైనవి కావని, శిలాజ ఇంధనాల వినియోగం, రాజకీయ నిర్లక్ష్యం కారణంగా ఏర్పడ్డాయని నివేదిక పేర్కొంది.
అమెరికాలో కాలిఫోర్నియా కార్చిచ్చులు అత్యధికంగా రూ.5 లక్షల కోట్ల (సుమారుగా) నష్టం కలిగించాయని వెల్లడించింది. ఆగ్నేయాసియా దేశాలైన థాయ్‌లాండ్, ఇండోనేసియా, శ్రీలంక, వియత్నాం, మలేసియాల్లో సంభవించిన తుపానుల కారణంగా దాదాపు రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని వివరించింది.