ప్రోవోక్ మీడియాకు చెందిన 2025 గ్లోబల్ 100 మంది ప్రభావశీల పారిశ్రామిక నేతల జాబితాలో, భారత అగ్రగామి కంపెనీల కమ్యూనికేషన్స్, మార్కెటింగ్ విభాగాల అధిపతులు చోటు చేసుకున్నారు. రిలయన్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ రోహిత్ బన్సల్, ఇన్ఫోసిస్ గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుమిత్ విర్మానీ, టీసీఎస్ గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అభినవ్ కుమార్, వేదాంతా గ్రూప్ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ రితు ఝింగావ్, గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ సుజిత్ పాటిల్, జిందాల్ స్టీల్ కార్పొరేట్ బ్రాండ్, కమ్యూనికేషన్స్ అధిపతి అర్పణ కుమార్ అహూజా తదితరులు ఈ జాబితాలో చోటు చేసుకున్నారు.