‘లింక్డ్‌ఇన్‌’ ఉత్తమ అంకుర సంస్థల జాబితా

‘లింక్డ్‌ఇన్‌’ ఉత్తమ అంకుర సంస్థల జాబితా

ప్రపంచంలో అతిపెద్ద ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ అయిన లింక్డ్‌ఇన్‌.. తాజాగా హైదరాబాద్‌లోని ఉత్తమ అంకుర సంస్థల జాబితాను వెల్లడించింది. ఇందులో ఏరోస్పేస్, సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌), ఎడ్యుటెక్‌ అంకుర సంస్థలదే పైచేయి. ఈ జాబితాను లింక్డ్‌ఇన్‌ ఏటా ప్రకటిస్తోంది. ఉద్యోగి వృద్ధి, ఉద్యోగంపై ఆసక్తి, ప్రతిభావంతులను ఆకర్షించటం... వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని దీన్ని రూపొందిస్తారు. ‘2025 టాప్‌ స్టార్టప్స్‌ లిస్ట్‌ ఫర్‌ హైదరాబాద్‌’ అనే పేరుతో రూపొందించిన ఈ జాబితాలో ఏరోస్పేస్‌ రంగానికి చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అగ్రస్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో రిసైకల్, స్వైప్‌ ఉన్నాయి. 2025 జాబితాలో ఏడు కొత్త సంస్థలు స్థానం సంపాదించాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram