2025లో దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో శివ్ నాడార్ కుటుంబం అగ్రస్థానంలో నిలిచినట్లు ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రఫి జాబితా-2025 వెల్లడించింది. 2024తో పోలిస్తే 26 శాతం అధికంగా ఆయన కుటుంబం 2025లో రూ.2,708 కోట్లు దానం చేసినట్లు తెలిపింది. అంటే ఆయన రోజుకు రూ.7.4 కోట్లు సమాజానికి తిరిగి ఇచ్చారు. గత అయిదేళ్లలో మన దేశంలో అత్యంత దానశీలిగా శివ్ నాడర్ నిలవడం ఇది నాలుగోసారి. తర్వాతి స్థానాల్లో ముకేశ్ అంబానీ, బజాజ్ కుటుంబం, కుమార్ మంగళం బిర్లా కుటుంబం, గౌతమ్ అదానీ కుటుంబం ఉన్నాయి.
ఈ జాబితాలో ఉన్న దేశీయ సంపన్నులు 191 మంది కలిసి 2025లో మొత్తంగా రూ.10,380 కోట్ల విరాళాలు ఇచ్చారు. ఇందులో 12 మంది కొత్తవారు.