క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్: ఆసియా 2026లో మన దేశంలోని 5 ఐఐటీలు, దిల్లీ విశ్వవిద్యాలయం, బెంగళూరులోని ఐఐఎస్సీ.. టాప్ 100లో నిలిచాయి. దిల్లీ, మద్రాస్, బొంబాయి, కాన్పుర్, ఖరగ్‌పుర్ ఐఐటీలు ఈ జాబితాలో చోటు సంపాదించిన వాటిలో ఉన్నాయి. ఈ ర్యాంకులు 2025, నవంబరు 4న విడుదలయ్యాయి.
* 2016లో ఈ జాబితాలో భారత్ నుంచి 24 సంస్థలే ఉండగా, ప్రస్తుతం 294 సంస్థలకు చోటు లభించింది.