ప్రపంచవ్యాప్తంగా 30 సంవత్సరాల్లోపు యువత (జెన్ జెడ్) మెచ్చిన నగరాల్లో బ్యాంకాక్ (థాయ్‌లాండ్) అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా అందుబాటు ధరలు, సంస్కృతి, రాత్రివేళల్లో వినోదభరిత జీవనం, నాణ్యమైన జీవితం- ఈ నాలుగు అంశాలకు వాళ్లు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు టైమ్ అవుట్ నిర్వహించిన సర్వే తెలిపింది. ఇందులో రెండో ఉత్తమ నగరంగా మెల్‌బోర్న్ నిలిచింది. మూడో స్థానంలో కేప్‌టౌన్ ఉంది.