ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల ప్రమాణం చేశారు. హైకోర్టులో 2025, ఆగస్టు 4న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ ఆయనతో ప్రమాణం చేయించారు. తాజా నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.
◊ జస్టిస్ తుహిన్ కుమార్ పార్వతీపురం మన్యం జిల్లా కత్తులకవిటి గ్రామానికి చెందినవారు. విశాఖపట్నం ఎన్‌బీఎం న్యాయ కళాశాల నుంచి ఆయన ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నారు.