ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 1,04,125 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా, వీటిలో 33.76 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ తరహా స్కూళ్లు అత్యధికంగా ఏపీలో 12,912 ఉండగా, తర్వాతి స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్ (9,508), ఝార్ఖండ్ (9,172), మహారాష్ట్ర (8,152) కర్ణాటక (7,349), లక్షద్వీప్ (7,217), మధ్యప్రదేశ్ (7,217), పశ్చిమ్ బెంగాల్ (6,482), రాజస్థాన్ (6,117), ఛత్తీస్‌గఢ్ (5,973), తెలంగాణ (5,001) ఉన్నాయి.