ఆంధ్రప్రదేశ్‌కు ప్రముఖ ఐటీ కంపెనీలను ఆకర్షించేలా ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్(ఎల్‌ఐఎఫ్‌టీ) పాలసీ(4.0)ని ప్రకటిస్తూ ప్రభుత్వం 2025, ఆగస్టు 16న ఉత్తర్వు జారీచేసింది. ఫార్చ్యూన్-500, ఫార్చ్యూన్-500 యూరప్, ఫార్చ్యూన్ గ్లోబల్-500, ఫార్చ్యూన్-1,000, ఫోర్బ్స్ గ్లోబల్-2,000లో గత మూడేళ్లలో ర్యాంకింగ్ పొందిన సంస్థలు ఐటీ, ఐటీఈఎస్, గ్లోబల్ కేపబుల్ సెంటర్స్(జీసీసీల) ఏర్పాటుకు రాయితీతో భూములు కేటాయిస్తారు. ఒక బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండాలనే నిబంధన విధించారు.