వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.9% వృద్ధి చెందే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్-రా) అంచనా వేసింది. జీఎస్‌టీ, ఆదాయపు పన్ను కోతలకు తోడు వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాల లాంటివి మన దేశానికి ఆర్థిక ఉత్ప్రేరకాలుగా పని చేస్తాయని పేర్కొంది.