పొగాకు ఉత్పత్తులపై అధిక పన్ను

పొగాకు ఉత్పత్తులపై అధిక పన్ను
  • పొగాకు ఉత్పత్తులపై జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను)కి, అదనంగా ఎక్సైజ్‌ సుంకాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం  తీసుకుంది. ఇది 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ‘పొగాకుపై పన్ను విధానాలకు’ అనుగుణంగా ఈ చర్య చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో పొగాకుపై పన్నులను ఏటా సవరిస్తున్నారు.
  • జీఎస్‌టీ అమలుకు ముందు భారత్‌లోనూ సిగరెట్లపై ఏటా ఎక్సైజ్‌ సుంకాన్ని సవరించేవారు. 2017 జులైలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక గత ఏడేళ్లుగా ఎటువంటి మార్పులూ చేపట్టలేదు. జీఎస్‌టీలోని గరిష్ఠమైన 28% పన్నుతో పాటు పరిహార సుంకం మాత్రమే ఇప్పటివరకు విధిస్తున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram