బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి గ్రూపు రష్యా విపణిలోకి అడుగుపెట్టబోతోంది. ఇందుకు గాను ఆ దేశ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఆరోగ్యం, సంరక్షణ, వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడం, నైపుణ్య మానవ వనరుల బదిలీ, పరిశోధన సంబంధిత కార్యకలాపాలు లాంటి లక్ష్యాలు ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి.
ఎంఓయూపై పతంజలి గ్రూపు తరపున బాబా రామ్‌దేవ్, ఇండో-రష్యా బిజినెస్ కౌన్సిల్ ఛైర్మన్, రష్యా మంత్రి సెర్గీ చెర్మిన్ సంతకాలు చేశారు. పతంజలి ఆయుర్వేద్, పతంజలి ఫుడ్స్ ద్వారా ఆయుర్వేదిక్, ఎఫ్‌ఎమ్‌సీజీ ఉత్పత్తులను పతంజలి గ్రూపు విక్రయిస్తుంది.