అమెరికాకు మనదేశ ఏఈఎఫ్‌

అమెరికాకు మనదేశ ఏఈఎఫ్‌
  • అమెరికాకు మనదేశం తొలిసారిగా విమాన ఇంధనాన్ని (ఏటీఎఫ్‌) ఎగుమతి చేసింది. అమెరికా (దక్షిణ కాలిఫోర్నియా)లోని అగ్రగామి సంస్థ షెవ్రాన్‌ రిఫైనరీలో కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటమే ఇందుకు కారణం. ఆ రిఫైనరీలో రోజుకు 2,85,000 బ్యారెళ్ల ఏటీఎఫ్‌ ఉత్పత్తి జరుగుతుంది.
  • అక్కడ అంతరాయం వల్ల, మనదేశ అగ్రగామి సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రిఫైనరీ నుంచి 60,000 మెట్రిక్‌ టన్నుల (4,72,800 బ్యారెళ్లు) ఏటీఎఫ్‌ను ప్రత్యేక ఓడ ద్వారా, 2025 అక్టోబరు 28-29 తేదీల్లో జామ్‌నగర్‌ ఓడరేవు నుంచి పంపారు. డిసెంబరు ప్రారంభంలో ఈ ఓడ లాస్‌ ఏంజెలెస్‌ను చేరుతుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram