అమెరికా విధించిన అధిక టారిఫ్‌ల ప్రభావాన్ని భారతీయ ఎగుమతిదార్లు తట్టుకునే నిమిత్తం రూ.45,000 కోట్ల విలువైన రెండు పథకాలకు కేంద్ర మంత్రివర్గం 2025, నవంబరు 12న ఆమోద ముద్ర వేసింది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, తొలిసారి ఎగుమతి చేసేవారు, కార్మికులు అధికంగా ఉండే రంగాల కోసం రూ.25,060 కోట్లతో ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్‌కు అనుమతినిచ్చింది. ఇందులో నిర్యత్ ప్రోత్సాహన్ (రూ.10,401 కోట్లు), నిర్యత్ దిశ (రూ.14,659 కోట్లు) అనే 2 ఉప పథకాలుంటాయి.
రెండో పథకమైన క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఫర్ ఎక్స్‌పోర్టర్స్ (సీజీఎస్‌ఈ) కింద రూ.20,000 కోట్ల వరకు తాకట్టు అవసరం లేని రుణాలు ఇస్తారు.