ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద విమానయాన విపణిగా భారత్ అవతరించినట్లు అంతర్జాతీయ విమానయాన సంస్థల సంఘం ఐఏటీఏ పేర్కొంది. 2024లో 24.1 కోట్ల మంది విమానాల్లో గమ్యస్థానాలకు చేరారని ఆ సంఘం వెల్లడించింది. ఐఏటీఏ విడుదల చేసిన ‘వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ గణాంకాల’ ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక విమాన ప్రయాణికులతో అమెరికా (87.6 కోట్లు) తొలిస్థానంలో నిలిచింది. చైనా (74.1 కోట్లు), యూకే (26.1 కోట్లు), స్పెయిన్ (24.1 కోట్లు) కూడా భారత్ కంటే ముందున్నాయి. భారత్‌లో 2023లో 21.1 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించగా.. గతేడాది 11.1% వృద్ధి కనిపించింది.
♦ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జంట విమానాశ్రయాల్లో ముంబయి - దిల్లీ 59 లక్షల మంది ప్రయాణికులతో 7వ స్థానంలో నిలిచాయి.