దేశ రక్షణ దళాల కోసం మానవ రహిత విమానాలను దేశీయంగా తయారు చేసేందుకు అమెరికా సంస్థ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్, ఇంక్.(జీఏ-ఏఎస్‌ఐ)తో మౌలిక రంగ దిగ్గజం ఎల్ అండ్ టీ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద ఇరు కంపెనీలు కలిసి మీడియం ఆల్టిట్యూట్ లాంగ్ ఎండ్యూరన్స్ (ఎమ్‌ఏఎల్‌ఈ) రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్(ఆర్‌పీఏఎస్)ను భారత్‌లో తయారు చేస్తాయి.
ఎల్ అండ్ టీకి రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ప్రెసిషన్ తయారీ, సిస్టమ్ ఇంటిగ్రేషన్ సామర్థ్యాలుండగా.. జీఏ-ఏఎస్‌ఐకి ఈ రంగాల్లో నిర్వహణ నైపుణ్యం ఉంది.