2025, జులైలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీల సంఖ్య రికార్డు స్థాయిలో 1,947 కోట్లకు చేరుకుంది. 2024 జులైతో పోలిస్తే ఇవి 35% అధికం. వీటి విలువ రూ.25.08 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 22% అధికం.
* 2025 జులైలో ఒక రోజు సగటు లావాదేవీల సంఖ్య 62.8 కోట్లుగా ఉంది. వీటి విలువ రూ.80,919 కోట్లు. యూపీఐ లావాదేవీల ఖర్చును ప్రస్తుతం ప్రభుత్వం భరిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.