ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటి వరకు (అక్టోబరు 12) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.33% పెరిగి రూ.11.89 లక్షల కోట్లకు చేరాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇవి రూ.11.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. కార్పొరేట్ పన్నులు అధికంగా వసూలు కావడంతో పాటు పన్ను రిఫండ్‌లు నెమ్మదించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు అధికమయ్యాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.7% పెరిగి రూ.25.20 లక్షల కోట్లకు చేరొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.