ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో తెలుగు కుర్రాడు ముకేశ్ నేలవల్లి స్వర్ణం నెగ్గాడు. 2025, అక్టోబరు 1న జరిగిన పురుషుల 25 మీటర్ల పిస్టల్ పోరులో అతడు 585 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
మరో భారత షూటర్ సాహిల్ చౌదరి (573)కి కాంస్యం లభించింది. రష్యా షూటర్ అలెగ్జాండర్ కొవలెవ్ (577) రజతం గెలిచాడు.
మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో తేజస్విని సింగ్ రజత పతకం సాధించింది.