అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాజల్ పసిడి పతకాన్ని నెగ్గింది. 2025, ఆగస్టు 22న సామోకోవ్ (బల్గేరియా)లో జరిగిన మహిళల 72 కేజీల ఫైనల్లో కాజల్ 8-6తో యుకిలూ (చైనా)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కు దక్కిన రెండో స్వర్ణమిది. ఇంతకుముందు తపస్య (57 కేజీ) పసిడి నెగ్గింది.