మహిళల వన్డే ప్రపంచకప్‌లో పోటీపడే జట్ల సంఖ్యను 10కి పెంచాలని ఐసీసీ నిర్ణయించింది. 2029లో ఈ జట్ల మధ్య మెగా టోర్నీ జరుగుతుంది. ప్రస్తుతం ఎనిమిది జట్లు ఆడుతున్నాయి. ఇటీవల జరిగిన మహిళల ప్రపంచకప్‌ను దాదాపు 3 లక్షల మంది అభిమానులు స్టేడియాలకు వచ్చి మ్యాచ్‌లను వీక్షించారు. డిజిటల్ వేదికలో 500 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అందుకే 2029 ప్రపంచకప్‌లో పది జట్లను ఆడించాలని నిర్ణయించినట్లు ఐసీసీ పేర్కొంది.
2025, నవంబరు 7న దుబాయ్‌లో జరిగిన బోర్డు సమావేశంలో వివిధ అంశాలపై ఐసీసీ నిర్ణయం తీసుకుంది.