భారత జట్టు 47 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్ నెగ్గింది. 2025, నవంబరు 2న ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో ఆలౌట్ అయ్యి 246 రన్స్ చేసింది.
ముఖ్యాంశాలు:
యువ ఓపెనర్ షెఫాలి వర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.
ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా దీప్తి శర్మ ఉంది.
విజేత జట్టుకు రూ.37.3 కోట్లు, రన్నరప్‌నకు రూ.20 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి.
మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన నాలుగో జట్టు భారత్.