భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు చీఫ్ కోచ్‌గా ఖలీద్ జమీల్ 2025, ఆగస్టు 1న ఎంపికయ్యాడు. దిగ్గజ ఆటగాడు విజయన్ సారథ్యంలోని ఏఐఎఫ్‌ఎఫ్ సాంకేతిక కమిటీ ముగ్గురి పేర్లతో జాబితాను తయారు చేసింది. స్టీఫెన్ కాన్‌స్టంటైన్, స్టెఫాన్ టర్కోవిచ్‌లను వెనక్కినెట్టి మాజీ అంతర్జాతీయ ఆటగాడు జమీల్ ఈ పదవికి ఎంపికయ్యాడు.