భవ్య పథకం

భవ్య పథకం
  • దేశంలో పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇచ్చేందుకు రూ.33,600 కోట్లతో భారత్‌ ఔద్యోగిక్‌ వికాస్‌ యోజన (భవ్య) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్క్‌లను అభివృద్ధి చేయనున్నారు. ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి, దేశీయ తయారీ రంగ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పాటును అందించడమే ఈ పథకం ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా 15 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా.
  • 2026-27 నుంచి 2031-32 వరకు ఆరేళ్ల పాటు కొనసాగే ఈ పథకం కింద 100 నుంచి 1000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్క్‌లను అభివృద్ధి చేస్తారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram