బియ్యం ఉత్పత్తిలో చైనాను వెనక్కినెట్టి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ 2026, జనవరి 4న వెల్లడించారు. 25 రకాల పంటలకు సంబంధించి 184 రకాల వంగడాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కొత్త వంగడాలతో రైతులకు అధిక ఆదాయం సమకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. మొత్తం 150.18 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తితో ప్రపంచంలోనే ప్రథమస్థానంలో నిలిచిందన్నారు.