గణాంకాలు, పథకాల అమలు శాఖ (ఎంఓఎస్‌పీఐ) 2026, జనవరి 1న కొత్త లోగోను విడుదల చేసింది. దేశ అభివృద్ధి ప్రక్రియలో డేటా ప్రాముఖ్యతను ఈ కొత్త లోగో వర్ణిస్తుందని వెల్లడించింది. లోగోలో ఉన్న అశోక చక్రం నిజానికి, పారదర్శకతకు, మంచి పరిపాలనకు గుర్తు కాగా.. రూపాయి చిహ్నం ఆర్థిక ప్రణాళికలో, విధాన రూపకల్పనలో, దేశ వృద్ధిలో గణాంకాల కీలక పాత్రను ప్రతిబింబిస్తుంది. అందులో ఉన్న అంకెలు, చిహ్నాలు ఆధునాతన డేటా వ్యవస్థను, స్టాటిస్టిక్స్ సైన్స్‌ను తెలుపుతాయని వివరించింది.