పత్రికా పఠనం తప్పనిసరి

పత్రికా పఠనం తప్పనిసరి
  • విద్యార్థుల రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను చూసే సమయాన్ని తగ్గించి, పుస్తక పఠన సంస్కృతిని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
  • పాఠశాల గ్రంథాలయాల్లో ఆంగ్ల, హిందీ వార్తాపత్రికలను     అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ప్రతిరోజూ ఉదయం విద్యార్థుల్ని సమావేశపరిచే సమయంలో కనీసం పది నిమిషాల సమయాన్ని వార్తాపత్రికల పఠనానికి కేటాయించాలని స్పష్టంచేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram