రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన 2025, ఆగస్టు 5న రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) భేటీని దిల్లీలో నిర్వహించారు. ఇందులో రూ.67వేల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు ఆమోదం లభించింది. వీటిలో దీర్ఘశ్రేణి డ్రోన్లు, పర్వతాల్లో మోహరించే రాడార్లు, క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి.
* భారత నౌకాదళం కోసం చిన్నపాటి అటానమస్ సర్ఫేస్ క్రాఫ్ట్, బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్, లాంఛర్ల కొనుగోలు, బరాక్-1 క్షిపణి రక్షణ వ్యవస్థ ఆధునికీకరణకు డీఏసీ పచ్చజెండా ఊపింది.