దేశంలో తొలి బుల్లెట్ రైలు 2027 ఆగస్టులో గుజరాత్‌లోని సూరత్-వాపి మధ్య నడుస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2025, నవంబరు 18న రైల్‌భవన్‌లో తెలిపారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి నుంచి ముంబయికి 508 కి.మీ. పొడవైన హైస్పీడ్ రైల్‌కారిడార్‌ను నిర్మిస్తున్నారు. తొలిదశలో 50 కి.మీ. మేర మాత్రమే రైలును నడపాలని మొదట అనుకున్నా ఇప్పుడు దానిని 100 కి.మీ.కి పెంచామని, మొత్తం ప్రాజెక్టు 2029 చివరికి పూర్తవుతుందని మంత్రి చెప్పారు.