130వ రాజ్యాంగ (సవరణ) బిల్లు

130వ రాజ్యాంగ (సవరణ) బిల్లు
  • ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ (సవరణ) బిల్లును పరిశీలించేందుకు భాజపా ఎంపీ అపరాజితా సారంగీ నేతృత్వంలో 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ఏర్పాటైంది. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి/ముఖ్యమంత్రి/ కేంద్ర-రాష్ట్ర మంత్రులనైనా తొలగించేందుకు వీలు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లు ఇది.
  • జేపీసీలో భాజపా నుంచి 15 మంది, ఇతర ఎన్డీయే పార్టీల నుంచి 11 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమిలోని కీలక పార్టీలు ఈ జేపీసీని బహిష్కరించాలని నిర్ణయించడంతో విపక్ష పార్టీల సభ్యుల సంఖ్య 4కే పరిమితమైంది. ఎన్సీపీ-ఎస్పీ, అకాలీదళ్, ఏఐఎంఐఎం, వైకాపా మాత్రమే ఈ కమిటీలో చేరాయి. ఓ నామినేటెడ్‌ సభ్యుడిని కూడా ఎంపిక చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram