సౌర విద్యుదుత్పత్తిలో జపాన్‌ను అధిగమించి మనదేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. జపాన్ 96,459 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగా భారత్ 1,08,494 గిగావాట్లను ఉత్పత్తి చేసిందని అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఐఆర్‌ఎన్‌ఏ) గణాంకాలు వెల్లడించాయి.