మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ పదవీ కాలాన్ని కేంద్రం ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈమేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ 2025, నవంబరు 6న నోటిఫికేషన్ జారీ చేసింది. తొలుత నిర్ణయించిన గడువు ప్రకారం ఈ కమిషన్ 2024 అక్టోబరు 10నాటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. నిర్దేశిత పని పూర్తికాలేదన్న ఉద్దేశంతో గడువును 2025 అక్టోబరు 10వ తేదీ వరకూ ప్రభుత్వం పొడిగించింది. నివేదికకు తుది రూపునివ్వడానికి మరికొంత సమయం కావాలన్న కమిషన్ విజ్ఞప్తితో పదవీకాలాన్ని 2026 ఏప్రిల్ 10 వరకు కేంద్రం తాజాగా పొడిగించింది.