పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగంలో ప్రైవేటు రంగ పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన రూ.లక్ష కోట్ల నిధిని ప్రధాని నరేంద్రమోదీ 2025, నవంబరు 3న ప్రారంభించారు. ‘శాస్త్ర సాంకేతికతల నవకల్పనల సమ్మేళనం’ (ఎస్టిక్-2025)ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఇకపై ఏటా దీన్ని నిర్వహిస్తామిన పేర్కొన్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించడానికి, దేశాన్ని సాంకేతిక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దటానికి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.