రాష్ట్రీయ బాల పురస్కార్‌

రాష్ట్రీయ బాల పురస్కార్‌
  • వీర బాలదివస్‌ సందర్భంగా కేంద్ర మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ప్రకటించిన ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2025’ను 18 రాష్ట్రాలకు చెందిన 20 మంది పిల్లలు అందుకున్నారు. ధైర్యసాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, సామాజికసేవ, శాస్త్రసాంకేతిక, క్రీడా విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని ఈ పురస్కారాలు వరించాయి. 2025, డిసెంబరు 26న విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు స్వీకరించారు.
  • ఇందులో తెలంగాణ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన 16 ఏళ్ల పర్వతారోహకుడు విశ్వనాథ్‌కార్తికేయ పడకంటి, ఏపీ కర్నూలు జిల్లాకు చెందిన 17 ఏళ్ల శివాని హోసూరు ఉప్పర ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram