ప్రముఖ వైద్యవేత్త అంబుజ్‌నాథ్‌బోస్ పురస్కారాన్ని 2025 సంవత్సరానికి ప్రముఖ వైద్యులు, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డికి ప్రదానం చేశారు. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ (ఆర్‌సీపీ) ఆధ్వర్యంలో అత్యుత్తమ పరిశోధనలకు ఏటా దీన్ని అందిస్తారు. ఎండోస్కోపీలో డాక్టర్ నాగేశ్వరరెడ్డి చేసిన పరిశోధనలు, కృషిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అవార్డుకు ఎంపిక చేశారు.