ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ‘2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ’ అవార్డును అందుకున్నారు. బోస్టన్ గ్లోబల్ ఫోరం (బీజీఎఫ్), ఏఐ వరల్డ్ సొసైటీ (ఏఐడబ్యూఎస్) ఆధ్వర్యంలో అమెరికాలోని బోస్టన్‌లో ఆయన్ను ఘనంగా సన్మానించారు. భారత్‌తో పాటు ప్రపంచంలో శాంతి పరిరక్షణ, నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికిగాను ఈ పురస్కారంతో గౌరవించారు.
ఈ అవార్డును ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచ శాంతికి సంబంధించి నైతిక, వ్యూహాత్మక మూలాలను బలోపేతం చేసిన అసాధారణ వ్యక్తులను సన్మానిస్తున్నారు.