2025 ఏడాదికి గానూ ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్’ అవార్డుల కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థలకు చెందిన 1,466 మంది పోలీసు సిబ్బందిని ఎంపిక చేసినట్లు 2025, అక్టోబరు 31న కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇందులో పహల్గాం ఉగ్రవాదులను హతమార్చడంలో కీలక పాత్ర పోషించిన 40 మంది జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఉన్నారు.
ఈ పతకాల ప్రదానాన్ని ఫిబ్రవరి 1, 2024న మొదలుపెట్టారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏటా అక్టోబరు 31న పతకాలను ప్రకటిస్తారు.