కర్ణాటకలోని రాయచూరులో ఉన్న తూర్పు ధార్వాడ్ క్రాటన్‌లోని అమరేశ్వర్ ప్రాంతంలో లిథియం నిల్వలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇతర సంస్థలతో కలిసి జరిపిన పరిశోధనలోల ఇది వెల్లడైంది.
ఈ అధ్యయనంలో లిథియం ప్రధానంగా రెండు ఖనిజాలు.. స్పోడుమీన్, జిన్వాల్డైట్‌లలో ఉన్నట్లు కనుగొన్నారు. వీటిపై భూ రసాయన విశ్లేషణ చేపట్టగా అరుదైన లోహాలు సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించారు.