దాడులు, వేధింపులకు గురయ్యే హిజ్రాలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడానికి తమిళనాడు ప్రభుత్వం ‘అరణ్(రక్షణ)’ పేరుతో వసతి గృహాల్ని తీసుకొచ్చింది. తొలి విడతగా చెన్నై, మదురైలో రెండు గృహాల్ని అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో కేంద్రంలో 25 మంది ఉండేలా సౌకర్యాలు కల్పించింది. సమాజంలో అభద్రతాభావంతో ఉన్న హిజ్రాలు, వివక్ష, వెలివేత, వేధింపులకు గురైనవారు, అనాథలుగా మిగిలినవారు.. గుర్తింపు కార్డు చూపించి ఉచిత వసతి పొందొచ్చు. బాధితుల్లో ధైర్యం నింపేందుకు కౌన్సెలింగ్ బృందాలనూ నియమించింది. 3 నెలల నుంచి 3 ఏళ్ల పాటు ఇక్కడ ఉండొచ్చు.