అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లా శేర్‌గావ్ అడవుల్లో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బీఎస్‌ఐ) బృందం ‘ఇంపేషన్స్ రాజీబియానా’ పేరుతో గురివింద (బాల్సమ్) జాతి పూలలో కొత్తరకాన్ని కనుక్కుంది. 2025, అక్టోబరు 14న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ వెల్లడించారు. డాక్టర్ కృష్ణా చౌలూ సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం దీన్ని గుర్తించింది.
బీఎస్‌ఐ గతంలోనూ పలు గులివింద జాతి పూలను దేశంలో గుర్తించింది.